బెంగాల్‌లో కరోనా విజృంభణ, సీఎం మమత కీలక నిర్ణయం

15 May, 2021 13:18 IST|Sakshi

కోల్‌కత్తా: భారత్‌లో కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహమ్మారి నియంత్రణకు అన్ని రాష్ట్రాలు నడుం బిగించాయి. దాదాపు అన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌  వంటి కట్టడి చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కరోనా కేసుల్లో విపరీతమైన పెరుగుదల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 16 నుంచి 30 వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ నిర్ణయంతో రేపటి (ఆదివారం) నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి రానుంది. కాగా పశ్చిమబెంగాల్‌లో కోవిడ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు కొత్తగా 20,846 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,94,802కు చేరింది. మరణాల సంఖ్య 12,993కు పెరిగింది.

చదవండి: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

మరిన్ని వార్తలు