కోవిడ్‌ పాజిటివ్‌.. 3 ఫంగస్‌లతో వ్యక్తి మృతి

29 May, 2021 20:45 IST|Sakshi

లక్నో: కరోనా నుంచి కోలుకున్న ప్రజలను ఫంగస్‌ బయపెడుతుంది. ఇప్పటికే దేశంలో బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తిలో మాత్రం మొత్తం మూడు ఫంగస్‌లు కనిపించిన సంగతి తెలిసిందే. సదరు వ్యక్తి నేడు మరణించాడు. సంజయ్‌ నగర్‌ ప్రాంతానికి చేందిన లాయర్‌ కున్వర్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమలో ఈ నెల 24 కున్వర్‌ సింగ్‌కు ఎండోస్కోపి చేయగా బ్లాక్‌, వైట్‌ ఫంగస్‌లతో పాటు ఎల్లో ఫంగస్‌ను కూడా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం టాక్సేమియా(రక్తం విషపూరితంగా మారడం)తో బాధపడుతూ కున్వర్‌ సింగ్‌ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

ప్రస్తుతం ఇదే ఆస్పత్రిలో ముదాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన రాజేష్‌ కుమార్‌(59) వ్యక్తికి కూడా తాజాగా ఎల్లో ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. రాజేశ్‌ కుమార్‌ మెదడు సమీపంలో ఫంగస్‌ని గుర్తించామని.. ఇప్పటికే దవడను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. రాజేష్‌ కుమార్‌కు కూడా టాక్సేమియా సోకింది కానీ.. తీవ్రత తక్కువగా ఉండటంతో అతడికి యాంటీ ఫంగల్‌ మెడికేషన్‌ అందిస్తున్నామని.. కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. 

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌ భయం: మగ్గానికి ఉరేసుకున్న బాధితుడు

మరిన్ని వార్తలు