Covid Fourth Wave Effect: దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. 84వేల యాక్టివ్‌ కేసులు

23 Jun, 2022 10:50 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ఫోర్త్‌ వేవ్‌ ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,313 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 38 మంది వైరస్‌ కారణంగా మృతిచెందారు. ఇదే సమయంలో కరోనా నుంచి 10,972 మంది కోలుకున్నారు. 

ఇక, దేశవ్యాప్తంగా 84వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 400లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎన్నంటే..?

మరిన్ని వార్తలు