భారత్‌లో కరోనా టెన్షన్‌.. భయపెడుతున్న పాజిటివిటీ రేటు

16 Jul, 2022 12:36 IST|Sakshi

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. వరుసగా మూడో రోజూ కూడా 20 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు రావడం ఆందోళన లిగిస్తోంది. 

కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 20,044 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. ఇదే సమయంలో కరోనాతో 53 మంది మరణించారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,30,071కు చేరింది. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కోలుకోగా, 5,25,660 మంది మృతిచెందారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 18,301 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 4.80 శాతానికి పెరిగిందని, యాక్టివ్‌ కేసులు 0.32 శాతం ఉండగా.. మరణాలు 1.20 శాతంగా ఉంది. 

ఇదిలా ఉండగా.. డ్రాగన్‌ కంట్రీ చైనాలో కొత్త వేరియంట్ల కారణంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చైనాలో నిన్ని ఒక్కరోజే 547 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 


 

మరిన్ని వార్తలు