మరీ ఇంత అమానుషమా: రోడ్డుపై రోగి హాహాకారాలు

10 May, 2021 16:30 IST|Sakshi

మైసూరు: తండ్రికి ఆస్పత్రిలో చూపించుకుని తిరిగి వస్తున్న సందర్భంగా కోవిడ్‌ నిబంధనల పేరిట పోలీసులు ఓ యువకుడి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆ యువకుడి తండ్రి నడిరోడ్డుపైనే పడి నరకయాతన అనుభవించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బీపీ, షుగర్‌ కలిగి ఉన్న చంద్రశేఖరయ్యను ఆయన కుమారుడు బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హుల్లహళ్లి రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెళ్లేందుకు అనుమతి ఇవ్వమని ఎంత ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదని, తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుడు ఆరోపించాడు.

రోగుల ఇంటికి తెల్లజెండా 
మైసూరు: మైసూరులోని కృష్ణరాజ నియోజకవర్గంలో కరోనా రోగుల ఇంటి ముందు తెల్లజెండాను అమర్చడం ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎస్‌ఏ రామదాస్‌ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాధితులకు మాస్కులు, సోప్, నిమ్మకాయలు, పసుపు, డిజిటల్‌ థర్మామీటర్, విటమిన్‌ సీ ట్యాబ్లెట్ల కిట్‌లను అందజేశారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి బాధితుల ఇంటికి తెల్లజెండాను అతికిస్తున్నట్లు చెప్పారు.  

చదవండి: కరోనా కల్లోలం: ఖాళీ అవుతున్న బెంగళూరు! 

మరిన్ని వార్తలు