కరోనా ప్రభావం: సామూహిక వివాహాల్లో ఒక్కటే జంట

4 May, 2021 10:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తుమకూరు(కర్ణాటక): కరోనా ప్రభావం కారణంగా ప్రజలు సాముహిక వివాహాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం కొద్ది మందిలో మాత్రమే వివాహం జరుపుకుంటున్నారు. తాజాగా, తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలో శ్రీధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో పేర్లు నమోదు చేసుకున్న ఒక్కజంటకే వివాహం జరిపించారు.

దొడ్డ ఎన్నెగెరె గ్రామంలో సోమవారం బీమాసతి తీతారాజు దేవాలయంలో అనిల్‌ కుమార్, భూమిక జంట నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. సంస్థ అధికారి ప్రేమానంద్, భాగ్య తదితరులు పాల్గొన్నారు. వైరస్‌ కారణంగా ఎవరూ పెళ్లి జరుపుకోవడానికి ముందుకు రాలేదు. 

మరిన్ని వార్తలు