ఇకపై డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు: కేజ్రీవాల్‌

8 Sep, 2020 20:53 IST|Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇక నుంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే కరోనా టెస్టింగ్‌కు వెళ్లేముందు గుర్తింపు కోసం రాష్ట్ర ప్రజలు తమ ఆధార్‌ కార్డును తీసుకెళ్లాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అంతేగాక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్‌ఆర్‌) అందించే ఫామ్స్‌ కూడా నింపాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. (ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం)

రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోవిడ్‌ పరీక్షల సంఖ్యను పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య ఒక భాగమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ట్విటర్‌లో ‘ఢిల్లీ ప్రభుత్వం పరీక్ష సామర్థ్యలను అనేక రేట్లు పెంచింది. కరోనా పరీక్షలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ అడగొద్దని ఈ రోజు ఉదయం ఆరోగ్య మంత్రికి ఆదేశాలు జారీ చేశాను. ఇక నుంచి ఏ వ్యక్తి అయినా సులభంగా పరీక్ష చేసుకోవచ్చు’. అని ట్వీట్‌ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో మహమ్మారి కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య సైతం పెరుగుతోంది. రోజుకు సుమారు మూడు వేల కేసులు వెలుగు చూస్తున్నాయి. (తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి!)

మరిన్ని వార్తలు