తొలి విడ‌త‌లో 3 కోట్ల మందికి టీకా ఉచితం​ : కేంద్ర మంత్రి

2 Jan, 2021 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ టీకా విషయంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. తొలి విడత‌లో మూడు కోట్ల మంది ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు ఉచితంగా కరోనా టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వీరిలో కోటి మంది హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు ఉంటార‌ని వెల్లడించారు. అలాగే మరో 27 కోట్ల మంది వివ‌రాలు ఖరారు చేస్తున్నట్టు కేంద్రమంత్రి వివరించారు.  దేశవ్యాప్తంగా  పలుచోట్లు అసలు వ్యాక్సిన్ ఇవ్వడం మినహా, డ్రిల్ సమయంలో మిగిలిన ప్రక్రియను అనుసరిస్తున్నట్లు వర్ధన్ తెలిపారు. (కరోనా వ్యాక్సిన్‌ : కోవిషీల్డ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌)

భారతదేశంలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ తొలిమొదటి స్థావరంలో 3 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఉచిత కరోనావైరస్ వ్యాక్సిన్లు అందించనున్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం తెలిపారు. ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ (జిటిబి) ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించే డ్రై రన్‌ను సమీక్షించిన తరువాత వర్ధన్ మీడియాతో మాట్లాడారు. అలాగే  టీకా భద్రత, సమర్ధతకు సంబంధించి ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్‌ సాగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్‌ నిర్వహించింది. వీటితోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్‌ చేపట్టనున్నారు. అటు ఆక్స్‌ఫర్డ్‌ సీరం ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌నునిపుణుల కమిటీ (ఎస్‌ఇసీ) శుక్రవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నిపుణుల కమిటీ నివేదిక మేరకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇవ్వాల్సి ఉంది.

మరిన్ని వార్తలు