ఫేస్‌బుక్‌ లైవ్లో కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు..

19 May, 2021 12:51 IST|Sakshi

బెంగళూరు: కరోనా ఎంతో మంది జీవితాలను అతలాకుతులం చేసింది. కనీసం కటుంబసభ్యలు కూడా కరోనాతో మరణించిన వారి కడచూపుకు కూడా నోచుకోలేక పోయారు. కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రసారం చేసిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మనోహర్ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి  కరోనాతో మరణించాడు. అతని మృతదేహన్ని  సుందాలోని ఇండియన్ క్రిస్టియన్ స్మశానవాటికలో అంత్యక్రియలకు తీసుకు వచ్చారు. క్వారంటైన్లో ఉన్న అతని కుటంబసభ్యలు, మలేషియాలో ఉన్న బంధువులు కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అతని అంత్యక్రియలను  స్నేహితులు ఏర్పాటు చేసిన  ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా వీక్షించారు. ఈ సంఘటన అందరినీ కలిచివేస్తోంది.

బెంగళూరు నగరంలో కరోనాతో ప్రియమైన వారిని కోల్పోయిన చాలా కుటుంబాలు అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఎందుకంటే వాళ్లు కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ  ఉన్నారు.  వారు అంత్యక్రియలను చూడడానికి వాట్సాప్, ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లైవ్ స్ట్రీమ్ చేయడానికి స్నేహితులు, వాలంటీర్లు పైన ఆధారపడుతున్నారు.  కొంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను కూడా సాయం తీసుకుంటున్నారు.

 కమ్మనహళ్లికి చెందిన ఓ మహిళ విక్టోరియా ఆసుపత్రిలో కరోనాతో మరణించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ చేయాలని ఆమె బంధువులు కోరుకున్నారు. టాబ్లెట్ ఉపయోగించి ఫేస్‌బుక్‌ లైవ్ ద్వారా చేశామని.. ఇండియన్ క్రిస్టియన్ స్మశానవాటికలో ఒక కెమెరామెన్ చెప్పారు.  విదేశాలలో ఉన్న బంధవులు  లైవ్ స్ట్రీమింగ్ అంత్యక్రియల కోసం అనేక అభ్యర్థనలు మాకు అందుతున్నాయి అని అన్నాడు.

(చదవండి:సెకండ్‌ వేవ్‌: ఆగని మృత్యుఘోష..కొత్తగా 2,67,334 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు