చెత్తకుప్పలో మెతుకులే పరమాన్నం

2 May, 2021 15:58 IST|Sakshi

లాక్‌డౌన్‌ పని దొరకని కూలీ దుస్థితి  

బనశంకరి: మానవాళికి కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న లక్షలాది కుటుంబాలు సుడిగుండాల్లో చిక్కుకున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి పోయి రోడ్డున పడ్డవారెందరో. ఒక కూలీ పని కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక చెత్తకుప్పలో మెతుకులు ఏరుకుతింటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో జరిగింది. ఆలూరు తాలూకా కోనపేటే రోడ్డులో పొరుగూరికి చెందిన రాజు అనే వ్యక్తి చెత్త కుప్పలో ఆహారం ఏరుకుని తిన్నాడు. 

దారినపోయేవారు గమనించి విచారించగా ఆకలిని తట్టుకోలేక ఇలా చేస్తున్నానని సమాధానమిచ్చాడు. అల్లంతోటలో ఏడాది కిందట పని కోసం వచ్చానని, లాక్‌డౌన్‌తో పని పోయిందని, ఊరికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవని చెప్పాడు. తెలిసినవారు కూడా ఎవరూ లేరని రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం తెలిసిన తాలూకా కట్టడ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆనంద్‌ అన్నం, సాంబారు తెప్పించి రాజుకు అందజేశాడు. తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్‌ తిమ్మయ్య ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాజుకి తానే తాపీ పని ఇప్పిస్తానని ఆనంద్‌ చెప్పాడు.

చదవండి:

మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో

మరిన్ని వార్తలు