కోవిడ్‌ ఎఫెక్ట్‌: మినీ బస్సులను అంబులెన్స్‌లుగా..

5 May, 2021 10:00 IST|Sakshi

నాగపూర్‌: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతిరోజు వేలాదిగా కొత్త కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఈ మహమ్మారి బారినపడి అనేక మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కానీ అనేక ఆసుపత్రుల్లో బెడ్‌లు, వ్యాక్సిన్‌లు, ఆక్సిజన్‌ల కొరత అధికంగా ఉంది. ముఖ్యంగా  కరోనా బాధితులను ఆసుపత్రికి చేర్చే అంబులెన్స్‌ల కొరత కూడా తీవ్రంగానే ఉంది. కానీ ఇదే అదను అని భావించిన కొందరు దుర్మార్గులు వ్యాపార ధోరణిని ప్రదర్శిస్తున్నారు. కొంత మంది అంబులెన్స్‌ డ్రైవర్‌లు పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నారు.

ఈ క్రమంలో మహరాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్‌ల కొరతను అధిగమించడానికి వినూత్నంగా ఆలోచించింది. నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మినీబస్సులను అంబులెన్స్‌లుగా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే  25 మినీ అంబులెన్స్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ సహా ఇతర అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ అంబులెన్స్‌ సేవలు అందరికీ అందించడం కోసం ప్రత్యేక హెల్స్‌లైన్ నెంబర్‌ 0712 2551417 ను అందుబాటులోకి తీసుకు వచ్చారు.  

మరిన్ని వార్తలు