ఐసీయూలో చక్కర్లు కొట్టిన ఆవు.. పేషంట్స్‌ సంగతేంటి?

20 Nov, 2022 11:19 IST|Sakshi

ఆసుపత్రిలో ఐసీయూ అనగానే అందరికీ.. విషమంగా ఉన్న పేషంట్స్‌కు మాత్రమే చికిత్స అందించే ప్లేస్‌ అని తెలుసు కదా. అయితే, ఒక్కోసారి ఐసీయూలోకి పేషంట్‌ను చూసేందుకే ఇతరులను ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతించరు. ఇలాంటి క్రమంలో ఐసీయూలోకి ఏకంగా ఓ ఆవు ప్రవేశించి చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లాలో ఉన్న ఓ ఆసుపత్రిలోని ఐసీయూలోకి ఆవు ప్రవేశించింది. అనంతరం.. ఆవు కొద్దిసేపు ఐసీయూ, ఆసుపత్రిలో చక్కర్లు కొట్టింది. అక్కడే తిరుగుతూ ఆసుపత్రి ఆవరణలోని చెత్త డబ్బాలో అన్న మెడికల్‌ వ్యర్థాలను తిన్నది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, ఆసుపత్రి యాజమాన్యంపై పేషంట్స్‌, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక, ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఐసీయూలోకి ఆవు ప్రవేశించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. అయితే, పాత కోవిడ్‌ వార్డులోకి ఆవు వెళ్లినట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనలో అజాగ్రత్తగా వ్యవహరించిన ఆసుపత్రి ఇన్‌చార్జ్‌, గార్డును సస్పెండ్‌ చేసినట్టు వివరణ ఇచ్చారు. సెక్యూరిటీ ఏజెన్సీకి నోటీసు జారీ చేసినట్టు తెలిపారు. 

మరిన్ని వార్తలు