కిరాక్‌ వీడియో.. ట్రక్కును బయటకు తీస్తూ క్రేన్‌ గాల్లోకి ఎగిరి..

4 Aug, 2022 23:25 IST|Sakshi

Crane Falls Off Bridge.. ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి పడిపోయిన ట్రక్కును బయటకు తీసే క్రమంలో క్రేన్‌ బ్రిడ్జిపై నుండి పడిపోయింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. తాల్చేర్ పట్టణంలో వంతెనపై నుండి ఓ ట్రక్కు నీటిలో పడిపోయింది. దీంతో, ఆ ట్రక్కును బయటకు తీసేందుకు రెండు క్రేన్స్‌ అక్కడికి చేరుకున్నాయి. కాగా, రెండు క్రేన్ల సాయంతో బెల్టులను ఉపయోగించి ట్రక్కును పైకి తీసే ప్రయత్నం జరుగుతోంది. ఇంతలో ఒక క్రేన్‌కు ఉన్న బెల్టు తెగిపోయింది.

దీంతో, మరో క్రేన్‌పైనే ట్రక్కు బరువు మొత్తం పడటంతో సదరు క్రేన్‌ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. అనంతరం ఒక్కసైడ్‌కు ఒరిగి.. బ్రిడ్జిపై నుంచి నీటిలో పడిపోయింది. అయితే, ప్రమాదంలో క్రేన్‌లోని డ్రైవర్‌ సమయ స్పూర్తితో నీటిలో దూకాడు. దీంతో, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


 

మరిన్ని వార్తలు