ఆలయంలోకి మొసలి, పూజరి వినతితో వెనకకు

22 Oct, 2020 11:22 IST|Sakshi

తిరువనంతపురం: ఉత్తర కేరళలోని కాసరగోడ్‌లో ఉన్న శ్రీ అనంతపుర ఆలయ ప్రాంగణంలోకి ఒక పెద్ద మొసలి  ప్రవేశించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గుడిలో ఉన్న పూజరి తిరిగి దానిని నీటిలోకి వెళ్లమని కోరగా... అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. చాలా ఏళ్ల నుంచి ఆలయంలో ఉన్న సరస్సులో బాబియా అనే ఒక మొసలి ఉంటుంది. అది శాఖాహారి. ప్రతి రోజు పూజరి దానికి రెండు పూటల ప్రసాదాన్ని ఆహారంగా అందిస్తారు. సరస్సు దగ్గరకు వెళ్లి పిలవగానే మొసలి పైకి వచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని ఆరగిస్తూ ఉంటుంది.

ఆ మొసలి అక్కడి సరసులోకి  ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ చాలా రోజుల నుంచి ఎవరికి హాని చేయకుండా అక్కడే ఉంటుంది .అయితే మొదటిసారి ఆలయ ప్రాంగణంలోకి వచ్చిందని పూజరి తెలిపారు. అలా వచ్చిన దాన్ని తిరిగి వెళ్లిపోవాలని  ఆలయ ప్రధాన అర్చకుడు చంద్రప్రకాష్ నంబిసన్ ఆదేశించారు. అంతే.. మొసలి కిమ్మనకుండా అక్కడ నుంచివె‍ళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే మొసలి గర్భగుడిలోకి ప్రవేశించిందని ప్రచారం జరుగుతుందని అది వాస్తవం కాదని ప్రధాన అర్చకులు తెలిపారు. ఇక బాబియా ఎప్పుడు క్రూరంగా ప్రవర్తించలేదని అక్కడి వారు తెలుపుతున్నారు. 

చదవండి: భర్తను సజీవ దహనం చేసిన భార్య 

మరిన్ని వార్తలు