అంటు రోగాలకు 1.5 కోట్ల మంది బలి

19 Dec, 2020 15:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అగ్ర దేశం అమెరికాతో సహా ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురి చేస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య భారత్‌లో కోటి దాటగా, మృతుల సంఖ్య 1.45 లక్షలు దాటింది. గతంలో ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్‌పై పలు మహామ్మారీలు దాడి చేయగా మరణించిన వారి సంఖ్యను గుర్తు చేసుకుంటే అసలు కరోనా వైరస్‌ను మహమ్మారి అనలేం. 1817 నుంచి 1920 మధ్య కలరా, ప్లేగ్, మశూచి, ఇన్‌ఫ్లూయెంజా (విషపడిశము) విజంభించడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు కోట్ల మంది మరణించగా, ఒక్క భారత దేశంలో కోటీ యాభై లక్షల మందికి పైగా మరణించారు. (చదవండి: ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే అంతేనట!)

మలేరియా, టీబీల కూడా భారత్‌లో లక్షలాది మంది మరణించినప్పటికీ అవి మహమ్మారిగా విస్తరించలేదు. నాడు చైనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా సైనోఫోబియాను సష్టించగా, భారత్‌లో విజంభించిన కలరా ప్రపంచ దేశాలను భయపెట్టింది. దాంతో విదేశీయులందరు కొంతకాలం భారత్‌ను, భారతీయులకు దూరం పెట్టారు. అప్పుడు ఈ రెండు అంటు వ్యాధులకు కోల్‌కతా కేంద్రంగా  మారింది. హరిద్వార్‌కు వెళ్లే హిందూ యాత్రికులు, మక్కాకు వెళ్లే ముస్లిం యాత్రకుల ద్వారా టీబీ, మలేరియా వ్యాపిస్తుందన్న ప్రచారమూ జరిగింది. ఆ రెండు అంటువ్యాధులను ‘ఆసియాటిక్‌ డిసీస్‌’ అని పాశ్చాత్య దేశాలు పిలిచాయి. భారత్‌లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరగు పర్చాలంటూ నాటి బ్రిటీష్‌ పాలకులపై ఒత్తిడి కూడా తెచ్చింది. (చదవండి: వ్యాక్సిన్‌పై వాస్తవాలేంటి?)

ప్లేగ్‌ కారణంగా భారత్‌లో పేదవాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నారు. వారి వల్ల వ్యాధి విస్తరిస్తుందన్న దుష్ప్రచారం వల్ల ముంబై, కోల్‌కతాతోపాటు  పలు నగరాల్లో పేదలపై దాడులు జరిగాయి. నాటి ముంబై ప్రభుత్వం ఈ దుష్ప్రచారాన్ని నమ్మి 1896లో పేదవారిని మురికి వాడల నుంచి బయటకు రాకుండా కఠిన నిబంధనలు విధించింది. నాడు బీజాపూర్‌ నగర ప్రజలంతా సాయంద్రం వేళ నగరాన్ని వీడి పొలాలకు వెళ్లే వారని ఓ బ్రిటీష్‌ డాక్టర్‌ రాసుకున్నారు. సామూహికంగా ఎలుకల మరణించడంతో ప్లేగ్‌ వ్యాది పేద ప్రజలకు సోకుతుందని, వారి నుంచి ఇతరులకు విస్తరిస్తుందన్నది నాటి ప్రచారం. నోటీలోని శ్లేష్మం ద్వారానే ఒకరి నుంచి ఒకరికి ప్లేగ్‌ వస్తోందని ఆధునిక సైన్స్‌ చెబుతోంది 

1918–1920 మధ్యకాలంలో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ వల్ల ప్రపంచవ్యాప్తంగా మతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ వల్ల రెండు కోట్ల మంది మరణించారు. 1918లో దేశ జనాభాలో 40 శాతం శాతం మందికి ఈ ఫ్లూ సోకిందని, వేలాది మంది మరణించారని గణాంకాలు చెబుతున్నా 1920 నాటికల్లా భారత్‌లో ఈ వ్యాధి బాగా అదుపులోకి వచ్చింది. ఇలాంటి విశేషాలెన్నో తెలసుకోవాలంటే చిన్మయ్‌ తుంబే రాసిన ‘ది ఏజ్‌ ఆఫ్‌ పాండెమిక్స్‌’ చదవాల్సిందే. 

మరిన్ని వార్తలు