వామ్మో.. కోటి రూపాయలు దాటేసిన కరెంటు బిల్లు!

23 Aug, 2020 16:16 IST|Sakshi

శ్రీనగర్‌ : సాధారణ పౌరుల గృహాలకు లక్షల్లో కరెంటు బిల్లులు రావడం ఈ మధ్య కాలంలో తరచూగా చూస్తూనే ఉన్నాం. అయితే కశ్మీర్‌లోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) బెటాలియన్‌కూ భారీగానే బిల్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కశ్మీర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ 181 బెటాలియన్‌ కేంద్రానికి ఏకంగా 1.5 కోట్ల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఇది చూసిన బెటాలియన్‌ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ బిల్లంతా జూలై నెలకు మాత్రమే వచ్చిందని అధికారులు వాపోయారు. దీనిపై స్పందించిన సీఆర్‌పీఎఫ్‌ అధికారి జుల్ఫీకర్‌ హసన్‌.. సాంకేతిక లోపం కారణాంగా అంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని వివరించారు. దీనిపై కశ్మీర్‌ విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు