మార్కెట్‌లోకి రానున్న సిప్లా ఫవిపిరవిర్‌

24 Jul, 2020 11:37 IST|Sakshi

సీఎస్‌ఐఆర్‌ సాంకేతికతో అభివృద్ధి

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధం ఫవిపిరవిర్‌ను ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ సిప్లా త్వరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టనుందని శాస్ర్తీయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) పేర్కొంది. తక్కువ ఖర్చుతో కరోనా ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎస్‌ఐఆర్‌ ఈ మందును అభివృద్ధి చేసింది. స్ధానికంగా లభ్యమయ్యే కెమికల్స్‌తో ఈ మందును అభివృద్ధి చేసిన సీఎస్‌ఐఆర్‌ ఈ సాంకేతికతను సిప్లాకు బదలాయించింది.

ఈ మందు త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని సీఎస్‌ఐఆర్‌ పేర్కొంది. తాము అభివృద్ధి చేసిన సాంకేతికత అత్యంత సమర‍్దవంతంగా పనిచేస్తుందని, తక్కువ వ్యవధిలోనే డ్రగ్‌ తయారీదారులు పెద్దసంఖ్యలో ఉత్పత్తి చేపట్టేందుకు అనువైనదని సీఎస్‌ఐఆర్‌-ఐఐసీఆర్‌ డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కరోనా వైరస్‌ బారినపడి స్వల్ప, మధ్యస్థ లక్షణాతో బాధపడే రోగుల చికిత్సలో ఫవిపిరవిర్‌ మంచి ఫలితాలను అందిస్తున్నట్టు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. చదవండి : పెళ్లింట కరోనా కలకలం..

మరిన్ని వార్తలు