సీఎస్‌ఐఆర్‌–ఎస్‌ఈఆర్‌సీలో ఉద్యోగాలు

21 May, 2021 16:51 IST|Sakshi

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌–స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(ఎస్‌ఈఆర్‌సీ).. టెక్నీషియన్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 07

► అర్హత: కనీసం 55శాతం మార్కులతో సైన్స్‌ సబ్జెక్టుల్లో ఎస్‌ఎస్‌సీ/పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: పోస్టును అనుసరించి 28 ఏళ్లు, 31 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ట్రేడ్‌ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా స్క్రీనింగ్‌ కమిటీ అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ట్రేడ్‌ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు. ట్రేడ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని తుది ఎంపికలో భాగంగా రాత పరీక్షకు పిలుస్తారు.

పరీక్షా విధానం: దీనిలో మూడు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌–1లో మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్, పేపర్‌–2లో జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్, పేపర్‌–3 సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును కంట్రోలర్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్‌–ఎస్‌ఈఆర్‌సీ క్యాంపస్, తారామణి, చెన్నై–600113 చిరునామాకు పంపించాలి
.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 11.06.2021
► వెబ్‌సైట్‌: https://www.serc.res.in

మరిన్ని నోటిఫికేషన్లు:
బొల్లారం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలు

టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్‌ పోస్టులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు