ఫేక్‌ న్యూస్‌ : సుప్రీం నోటీసులు

2 Feb, 2021 10:03 IST|Sakshi

తప్పుడు వార్తలు.. విద్వేష ప్రసంగాలు.. 

సోషల్‌ మీడియా కట్టడిపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలకు ఆయా సంస్థలనే బాధ్యులుగా చేయాలన్న విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, సంబంధిత వర్గాలకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ వి.రామ సుబ్రమణియన్‌ల ధర్మాసనం విచారించింది.

ఈ పిటిషన్‌ను, మీడియా, చానెళ్లు, నెట్‌వర్క్‌లపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా మీడియా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ గతంలో దాఖలైన పిల్‌తో కలిపి విచారణ చేపడతామని తెలిపింది. మీడియా, చానెళ్లు, నెట్‌వర్క్‌లపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్‌ను జనవరి 25వ తేదీన విచారించిన ధర్మాసనం.. కేంద్రంతోపాటు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, న్యూస్‌ బ్రాడ్‌ కాస్టర్స్‌ అసోసియేషన్‌లకు నోటీసులు జారీ చేసింది.  

మరిన్ని వార్తలు