గొర్రెకు మసాజ్‌ చేస్తున్నపిల్లి .. వైరల్‌ వీడియో..

5 May, 2021 11:54 IST|Sakshi

పిల్లి ఏం చేసినా క్యూట్‌గా ఉంటుందంటారు క్యాట్‌ లవర్స్‌. కానీ దొంగలా పాలు తాగి ఏమీ ఎరగనట్టు నటించే ఆ మూగజీవిని చూస్తే చిర్రెత్తిపోతారు మరికొందరు. అయితే ఇక్కడ మాత్రం ఓ పిల్లి ఎలాంటి దొంగ వేషాలు వేయకుండా ఓ గొర్రెకు మసాజ్‌ చేసి నిద్ర పుచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో గొర్రె , పిల్లి మంచి ఫ్రెండ్స్‌గా మారాయి. గొర్రె కింద పడుకుంటే పిల్లి దాని వీపు మీద ఎక్కింది. ఏదో పరుపుపై పడుకున్నట్లుగా హయిగా అక్కడే సెటిలైంది. అంతటితో ఆగకుండా అది గొర్రెకు మసాజ్‌ చేయడం మొదలు పెట్టింది.

పిల్లి తన రెండు కాళ్లతో గొర్రెను పైకి కిందకు నొక్కుతుంటే అది హాయిగా పడుకుంది. నిండుగా ఉన్న గొర్రె బూరులో పిల్లి తల దూర్చి మరీ పడుకుంది. ఇంత జరుగుతున్నా గొర్రె మాత్రం ఎటూ కదలకుండా నిద్రలో మునిగిపోయింది. ఈ వీడియో​ చూసిన నెటిజన్లు 'పిల్లి ఎంత బాగా మసాజ్‌ చేస్తుంది', 'గొర్రె అలసిపోయిందేమో.. కనీసం లేవడం లేదు', 'అది పిల్లి చేస్తున్న మసాజ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నట్లుంది', 'పిల్లి మాకు కూడా మసాజ్‌ చేస్తుందా..' అంటూ ఫన్నీగా కామెంట్లు​ పెడుతున్నారు.

మరిన్ని వార్తలు