ఆదమరిచి క్లిక్ చేస్తే.. బ్లాక్ మెయిల్ చేసి..

20 Aug, 2021 15:36 IST|Sakshi

బనశంకరి: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులనే టార్గెట్‌గా చేసుకున్న సైబర్‌ కేటుగాళ్లు, ఎస్కార్ట్స్‌, లోకాంటో వెబ్‌ లింక్‌లు పంపించి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు మొదట మొబైల్‌ ఫోన్‌కు మోసపూరిత వెబ్‌సైట్‌ లింక్‌ తో కూడిన మెసేజ్‌ పంపిస్తారు. లేదా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం లో పరిచయం పెంచుకుని మొబైల్‌ నంబర్లను సేకరించి పలు రకాల ప్రలోభాలతో ఊరిస్తారు. వారు పంపిన లింక్‌పై క్లిక్‌ చేయమంటారు.

క్లిక్‌ చేస్తే చాలు.. వీడియో కాల్‌లో నగ్న దృశ్యాలు కనిపించి క్షణాల్లో రికార్డు, స్క్రీన్‌ షాట్లను తీసుకుంటారు. మరో పక్క బాధితుని బంధుమిత్రుల ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలు, ఫోన్‌నంబర్లనూ సేకరిస్తారు. వారికి మీ చిత్రాలను, వీడియోలను ట్యాగ్‌చేస్తామని, వాట్సప్‌కు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రకంగా పెద్దమొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు తరచూ బెంగళూరు నగర సీఇఎన్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదు అవుతున్నాయి.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వీడియో కాల్స్‌కు, వెబ్‌ లింక్‌లకు స్పందించరాదని పోలీసులు సలహా ఇచ్చారు. 

మరిన్ని వార్తలు