మాండూస్‌ బీభత్సం.. కుంభవృష్టితో తమిళనాడు పది జిల్లాలు అతలాకుతలం

10 Dec, 2022 10:53 IST|Sakshi

సాక్షి, చెన్నై: మాండూస్‌ తుపాను ప్రభావం తమిళనాడుపై భారీగా చూపిస్తోంది.  తమిళనాడులో భారీ వర్షాలు. చెన్నైతో పాటు పది జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌ నుంచి అన్ని విమానాలను రద్దు చేశారు. అంతేకాదు.. ఆయా జిల్లాల పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

చెన్నై మెరీనా బీచ్‌లో సముద్రం ముందుకు వచ్చి.. తీరాన్ని ముంచెత్తింది. మరోవైపు నగరంలోని పలు రోడ్లు నిన్నటి(శుక్రవారం) నుంచి కురుస్తున్న వర్షానికి జలమయం అయ్యాయి. చాలా చోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి.. ఆస్తి నష్టం సంభవించింది.

తమిళనాడులోని చెంగలపట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను, మరో 9 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను ఇండియన్‌ మెట్రోలాజికల్‌ డిపార్ట్‌మెంట్‌ (ఐఎండి) జారీ చేసింది. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.తుపాన్‌ ప్రభావం పాండిచ్చేరిలోనూ తీవ్రంగా ఉంది. ఇక్కడ తీర ప్రాంతంలో సముద్రపు అలల తాకిడికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

మరిన్ని వార్తలు