మిచౌంగ్‌: చెన్నై అతలాకుతలం, జనం ఇక్కట్లు, వైరల్‌ వీడియోలు

4 Dec, 2023 19:50 IST|Sakshi

తమిళనాడులో మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది.  ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. ఒకచోట మొసలి రోడ్డుపైకి  దృశ్యంతోపాటు, తుపాను బీభత్సానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వేపైకి నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని కూడా మూసివేశారు. దీంతోపాటు  ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారులు హెచ్చరించారు.

రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. ఇప్పటికే దేశవ్యాప్తంగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు పాక్షికంగా లేదా పూర్తిగా రైళ్ల సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.  

చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా.

>
మరిన్ని వార్తలు