తౌక్టే బీభత్సం: చూస్తుండగానే కుప్పకూలిన భవనం

15 May, 2021 14:51 IST|Sakshi

తిరువనంతపురం: ఆరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తౌక్టే తుపాను ప్రభావంతో సముద్రం ఎగిసిపడుతోంది. దీంతో కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వాతావరణం భయానకంగా మారింది.కేరళలోని కసర్‌గడ్‌లో తుపాన్‌ ప్రభావంతో వీచిన గాలులకు ఒక అంతస్తు ఉన్న భవనం కుప్పకూలింది. ఆ భవనం సముద్రపు జలాల్లో కలిసిపోయింది. అదృష్టవశాత్తు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆ భవనంలో ఎవరూ లేరు.

ఈ తుపాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తుపానుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఆ తుపాను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర సహాయక బృందంతో పాటు రాష్ట్రాలు తుపాను నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

చదవండి: వైరల్‌ వీడియో: ఎలుకల వర్షం చూశారా

చదవండి: రెడ్ అలర్ట్.. ముంచుకొస్తున్న తుపాను..

మరిన్ని వార్తలు