-

ఆరు రాష్ట్రాలపై 'తౌక్టే' తుపాను ప్రభావం

16 May, 2021 15:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 'తౌక్టే' తుపాను ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. గోవాకు ఉత్తర వాయవ్యంలో తుపాను కేంద్రీకృతమై ఉందని, ఎల్లుండి గుజరాత్‌ వద్ద తీరం దాటనుందని పేర్కొంది. 18న మ.2:30 నుంచి రా.8:30 మధ్య తీరం దాటే అవకాశం ఉందని, పోర్‌బందర్‌-నలియా మధ్య తీరం దాటనుందని తెలిపింది. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపై తౌక్టే ప్రభావం చూపనుందని, ముంబైలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

కాగా, తుపాను ప్రభావంతో కర్ణాటకలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో 6 జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో నలుగురు మృతి చెందారు. కర్ణాటకలో 73 గ్రామాలపై తౌక్టే తుపాను ప్రభావం చూపుతోంది. ‘తౌక్టే' తుపానుపై ప్రధాని మోదీ సమీక్షించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

మరిన్ని వార్తలు