పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్ బీభత్సం..

17 May, 2021 17:32 IST|Sakshi

ముంబై: తౌక్టే తుఫాను  పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ముంబైలో తుఫాన్ బీభ‌త్సం సృస్టిస్తున్న‌ది. వాతావరణ శాఖ  ఆరెంజ్‌ హెచ్చరిక జారీ  చేయడంతో 3 గంటలపాటు ముంబై ఎయిర్‌పోర్టు మూసి వేశారు. ఇప్పటివరకు 12,420 మంది ప్రజలను తీరప్రాంతాల నుంచి  మహారాష్ట్రలోని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.  తౌటే’ తుఫాను గుజరాత్‌లో ఈ రోజు సాయంత్రం  తీరం దాటే అవకాశం ఉంది. దీని కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్‌ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుసహాయక చర్యల కోసం 54 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి

కేరళలోను తౌక్టే తుఫాన్‌ బీభత్సం సృస్టిస్తున్న‌ది. ముఖ్యంగా 9 జిల్లాల్లో తౌక్టే తుపాను ప్రభావంఎక్కువగా వుంది.ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురంలో భారీ వర్షాలుకురుస్తున్నాయి. కర్ణాటకలోని 7 జిల్లాల్లో తౌక్టే తుపాను ప్రభావం  ఎక్కవగా వుంది. ఉడుపి నాడా ప్రాంతంలో 38.5 సెం.మీ వర్షపాతం  నమోదైంది.  గోవాను  తౌటే తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. భారీ ఈదురుగాలులతో వర‍్షం కురుస్తుంది.తుఫాన్‌ కారణంగా ఇద్దరు మృతి చెందారు.

(చదవండి:అతి తీవ్ర తుపానుగా మారిన తాక్టే తుపాను)

మరిన్ని వార్తలు