టౌటే బీభత్సం: ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని ఏరియల్‌ సర్వే

19 May, 2021 16:07 IST|Sakshi

ఉనా, దీవ్, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే

ఏరియల్‌ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష

అహ్మదాబాద్‌: అత్యంత తీవ్ర తుపాను ‘టౌటే’ పెను విధ్వంసం సృష్టించింది. ఇక తీర ప్రాంత జిల్లాల్లో పెను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. అహ్మదాబాద్‌ సహా గుజరాత్‌ రాష్ట్రంలోని 35 తాలూకాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అతి భీక‌రంగా విరుచుకుప‌డ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి న‌ష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్‌, డయూలో పర్యటించారు. ఉనా, డ‌యూ, జాఫరాబాద్‌, మ‌హువా ప్రాంతాల్లో మోదీ ఏరియల్‌ స‌ర్వే నిర్వహించారు. ఇందులో ప్రధాని వెంట గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ కూడా ఉన్నారు.  తుఫాను ప్ర‌భావానికి గురైన ప్రాంతాల్లో జ‌రిగిన న‌ష్టాన్ని ఇంకా అంచ‌నా వేయ‌లేదు. తదుపరి సహాయక చర్యలు, తుఫాను కారణంగా వాటిల్లిన నష్టానికి సంబంధించి మరికాసేపట్లో ప్ర‌ధాని మోదీ అహ్మ‌దాబాద్‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు.

( చదవండి: CycloneTauktae: గుజరాత్‌ అతలాకుతలం )

మరిన్ని వార్తలు