తుపానుకు తోడైన పౌర్ణమి పోటు

26 May, 2021 14:41 IST|Sakshi

గ్రామాన్ని చుట్టుముట్టిన సముద్రం

భద్రక్‌: యాస్‌ తుపాను ఒడిషాలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ఎఫెక్ట్‌కి పౌర్ణమి పోటు తోడవటంతో ఊరికి, సముద్రానికి మధ్యన ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. నిన్నటి వరకు సముద్ర తీరంలో ఉన్న ఊరు కాస్త ఈరోజు సముద్రంలో భాగమైంది. ఒడిషాలోని భద్రక్‌ జిల్లాలోని ధర్మ గ్రామంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది.


సునామీ తరహాలో
అతి తీవ్ర తుపానుగా మారిన యాస్‌ ఒడిషా, బెంగాల్‌ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తోంది. తుపాను తీరం దాటే ముందు పెను గాలులు, భారీ వర్షాలు సహజమే. కానీ ఈసారి తుపాను తీరం దాటే సమయంలో పౌర్ణమి కూడా రావడంతో సముద్రం పోటు అసాధరణంగా ఉంది. బంగళాఖాతంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు పది మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. ఇక భద్రక్‌ జిల్లాలో ధర్మా గ్రామ సమీపంలో అయితే సముద్రం మరింగా ఉప్పొంగింది.  సునామీ తరహాలో గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఈ ‍గ్రామాన్ని తనలో కలిపేసుకుంది.

మరిన్ని వార్తలు