దళితుల ఆవేదన.. మృతదేహంతో కలెక్టరేట్‌కు

16 Nov, 2021 07:55 IST|Sakshi
మండ్య కలెక్టరాఫీసు వద్ద మృతదేహంతో ధర్నా

సాక్షి, మండ్య(కర్ణాటక): అణగారిన వర్గాలు తనువు చాలిస్తే అంత్యక్రియలకు శ్మశానం లేదనే ఆక్రోశంతో మండ్య తాలూకాలోని హుళ్ళెనహళ్ళి గ్రామస్తులు సోమవారం మృతదేహంతో ధర్నా చేశారు. గ్రామవాసి సిద్దాచార్‌ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి శ్మశానం లేకపోయింది. దీంతో బంధువులు, గ్రామస్తులు కలిసి శవాన్ని మండ్యకు తీసుకొచ్చి ఏకంగా కలెక్టరేట్‌ ముందు పెట్టుకొని ధర్నా నిర్వహించారు.

తమ గ్రామంలో దళితుల చనిపోతే అంత్యక్రియలు చేయడానికి రుద్రభూమి లేదని వినతిపత్రం అందజేశారు. దీంతో కలెక్టర్‌ ఎస్‌.అశ్వతి, తహసీల్దార్‌తో కలిసి గ్రామానికి వెళ్ళి స్మశానస్థలి కోసం పరిశీలించారు. దాంతో గ్రామస్తులు శాంతించి శవాన్ని తీసుకొని వెళ్లారు.    

మరిన్ని వార్తలు