దండకారణ్యంలో ‘దంతేశ్వరి’ బెటాలియన్‌

28 Jul, 2021 09:49 IST|Sakshi

చర్ల: దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతలో మహిళా కమాండోలు దూసుకెళ్లనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల కట్టడికి సిబ్బంది కొరత సమస్య ఎదురవుతున్న నేపథ్యంలో దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌.. డీఆర్‌జీ బలగాల నుంచి కొందరు మహిళలను ఎంపికచేసి ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఈ బృందానికి ‘దంతేశ్వరి బెటాలియన్‌’ అనే పేరు పెట్టారు. వీరిని కూంబింగ్‌ ఆపరేషన్లకు వినియోగించనున్నారు.

ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ మహిళా కమాండోలకు ప్రత్యేక కిట్లు, అధునాతన ఆయుధాలనిచ్చి దండకారణ్యానికి తరలిస్తున్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు