భళా రజని.. సాహసోపేతంగా కుక్కను కాపాడిన మహిళ

12 Apr, 2021 15:22 IST|Sakshi

యశవంతపుర: కుక్క బావిలో పడిపోతే అయ్యో అని చూసి వెళ్లిపోయేవారే అందరూ. కష్టమైనా సరే బావిలోకి దూకి రక్షించాలని తాపత్రయపడేవారు తక్కువగా ఉంటారు. అందులోనూ ఒక మహిళ ప్రాణాలకు తెగించి బావిలోకి దిగి శునకాన్ని రక్షించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటన కర్ణాటకలో మంగళూరు నగరంలోని బల్లాళ్‌ బాగ్‌లో జరిగింది.

రజని శెట్టి అనే మహిళకు శునకాలంటే ఎంతో ప్రేమ. వీధి కుక్కలకు ఆహారం అందిస్తూ ఉంటారు. సమీపంలో ఇంటి వద్దనున్న 45 అడుగుల లోతైన బావిలోకి శుక్రవారం రాత్రి ఒక పెంపుడు కుక్క పడిపోయింది. కుక్క యజమాని రజనికి విషయం చెప్పారు. రజని వెంటనే కుక్కను కాపాడాలని నిర్ణయించుకున్నారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి దిగి కుక్కను భద్రంగా పైకి తీసుకొచ్చారు. ఆమె గతంలో కూడా అనేకసార్లు బావిలో పడిన కుక్కలను రక్షించినట్లు స్థానికులు తెలిపారు.

చదవండి: మళ్లీ స్టార్ట్‌: సైకిల్‌పై చక్కర్లు కొట్టిన స్టాలిన్‌!

>
మరిన్ని వార్తలు