కూతురు ప్రియుడితో కనిపించడంతో రోడ్డుపైనే..

16 Oct, 2021 09:23 IST|Sakshi

యువతీయువకులు సాధారణంగా తమ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వ్యవహారాలు సాగిస్తుంటారు. అయితే ప్రేమ విషయం, ప్రేమికుడితో బయట తిరుగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని యువతీయువకులు ఊహించరు. కానీ, తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం తెలిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారుతాయి. అటువంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో చోటు చేసుకుంది.

నిర్మానుష్య ప్రదేశంలో ఓ తండ్రికి తన కుమార్తె మరో యువకునితో కనిపించింది. దీంతో కోపం తట్టుకోలేని ఆ తండ్రి రోడ్డు మీద బహిరంగా ఇద్దరిని పట్టుకొని ప్యాంట్‌కు ఉన్న బెల్టు తీసి చావబాదాడు. తన కుమార్తె ఆ యువకునితో తిరుగుతూ తప్పుడుగా ప్రవర్తిస్తోందని భావించాడా తండ్రి. అందుకే ఆగ్రహం తట్టుకోలేక ఇద్దరిపై దాడి చేశాడు.

ఈ ఘటనను అక్కడ ఉన్న స్థానికులు వీడియోలో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. యువతి తండ్రిపై యువకుడు స్థానిక తిమర్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన దర్యాపు చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు