సింగిల్‌ షాట్‌ స్పుత్నిక్‌ లైట్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

7 Feb, 2022 08:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్‌–డోసు స్పుత్నిక్‌ లైట్‌ టీకాకు డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఆదివారం ట్విటర్‌లో ప్రకటించారు.

స్పుత్నిక్‌–5 టీకా తరహాలోనే స్పుత్నిక్‌ లైట్‌ టీకా పని చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీంతో డ్రగ్‌ రెగ్యులేటర్‌లోని నిపుణుల కమిటీ శనివారం ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. త్వరలో డీసీజీఐ పూర్తి స్థాయిలో తుది అప్రూవల్‌ ఇవ్వనుందని తెలుస్తోంది. స్పుత్నిక్‌ లైట్‌తో భారత్‌లో వ్యాక్సిన్‌ల సంఖ్య 9కి చేరింది.

చదవండి: సూది, నొప్పి లేకుండా కరోనా వ్యాక్సిన్‌.. మనదేశంలోనే!

మరిన్ని వార్తలు