గుడ్‌న్యూస్‌: మోడెర్నా వ్యాక్సిన్‌కు డీసీజీఐ ఓకే

30 Jun, 2021 00:53 IST|Sakshi

భారత్‌లోకి టీకా దిగుమతులు, మార్కెటింగ్‌కి ‘సిప్లా’ దరఖాస్తు 

అత్యవసర వినియోగానికి అనుమతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగానికి పరిమితం చేసిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ మోడెర్నా దిగుమతికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ముంబైకి చెందిన సిప్లా సంస్థకు అనుమతి ఇచ్చింది. దీంతో, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవిïÙల్డ్, కోవాగ్జిన్, స్పుతి్నక్‌ వ్యాక్సిన్ల తర్వాత త్వరలో మోడెర్నా ప్రజలకు అందుబాటులోకి రానుంది. మోడెర్నా వ్యాక్సిన్‌ భారతీయ భాగస్వామి సిప్లా ఇచి్చన దరఖాస్తును పరిశీలించి అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సిన్‌ను వాడేలా డీసీజీఐ నిర్ణయం తీసుకుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు వి.కె.పాల్‌ మంగళవారం తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ త్వరలోనే దిగుమతి అవుతుందన్నారు. దీంతోపాటు, ఫైజర్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలను కూడా దేశంలోకి ఆహా్వనించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.  

అమెరికా ప్రభుత్వం తన కోవిడ్‌  వ్యాక్సిన్‌ డోస్‌లను కోవాక్స్‌ ద్వారా భారతదేశానికి విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించిందన్న విషయాన్ని మోడెర్నా సంస్థ జూన్‌ 27న డీసీజీఐకి తెలిపింది. ఈ విషయంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ) అనుమతి కోరింది. కాగా, సోమవారం అమెరికా వ్యాక్సిన్‌ తయారీ సంస్థ తరపున వ్యాక్సిన్‌ల దిగుమతి, మార్కెటింగ్‌ కోసం అనుమతి ఇవ్వాలని సిప్లా సంస్థ కోరింది. అయితే మోడెర్నాకు ఇచ్చే అనుమతి అత్యవసర పరిస్థితులలో పరిమిత ఉపయోగం కోసం ఉద్దేశించిందని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, దేశంలో వ్యాక్సినేషన్‌ వేగవంతానికి, యూఎస్‌ ఎఫ్‌డీఏ, యూకే ఎంహెచ్‌ఆర్‌ఏ లేదా డబ్ల్యూహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ డ్రగ్‌ రెగ్యులేటర్ల ఆమోదం పొందిన విదేశీ టీకాలకు సీడీఎల్‌ వద్ద బ్యాచ్‌ల వారీ పరీక్షను మినహాయించాలని డీసీజీఐ నిర్ణయించింది.   

చదవండి : Flipkart Monsoon Sale 2021: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు

మరిన్ని వార్తలు