బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర

6 Sep, 2022 08:54 IST|Sakshi
ఉప్పుతో కప్పి పెట్టిన బాలుడి మృతదేహం

బళ్లారి జిల్లాలో బాలుడి తల్లిదండ్రుల మూఢ నమ్మకం

సాక్షి, బళ్లారి: నీట మునిగి మరణించిన బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే మళ్లీ బతుకుతాడన్న నమ్మకంతో తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. ఈ ఘటన కర్ణాటకలో బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామంలో జరిగింది. శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్‌(10) సోమవారం ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. 

అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు సుమారు 4–5 బస్తాల ఉప్పును తెచ్చి మృతదేహంపై కుప్పగా పోశారు. బాలు డు బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. ఈ ఉదంతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.  

చదవండి: (పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షం)

మరిన్ని వార్తలు