వైరల్‌: ఇదేం చేప.. చంపినా బతికేస్తోంది!

15 Feb, 2021 14:36 IST|Sakshi

చేపలను చూడగానే వండుకొని అయినా లేదా కాల్చుకొని అయినా హాయిగా లాగించేయాలనిపిస్తుంది. చేపలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చు. వారానికి రెండుసార్లు చేపలు తింటే 500 మిల్లీ గ్రాముల ఒమేగా-3 శరీరానికి అందుతుందట. అలాగే ఒమేగా ఆమ్లాలు మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తాయి.

అయితే ఇక్కడ చెప్పబోయే ఓ చేప విషయంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఈ చేపను నిలువగా చీల్చేసినా సరే కదులుతోంది. కోసిన భాగాలు మళ్లీ దగ్గరకు అతుక్కుపోతున్నాయి. దాన్ని ఎన్నిసార్లు విడదీసినా మళ్లీ మళ్లీ అదే జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు చేపకు దెయ్యం పట్టిందా.. చంపినా బతికేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది వాస్తవం కాదు. ఇది కండరాల సంకోచం. బాగా తాజాగా ఉండే చేపను నిలువునా కోస్తే.. కండరాల్లో కదలిక మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మెదడు ఇచ్చే ఆదేశాల ప్రకారం ఆ కండరాలు కదిలుతాయి. అందుకే.. ఈ చచ్చిన చేప అలా ప్రవర్తిస్తోంది.

>
మరిన్ని వార్తలు