Audit Bureau Of Circulations- ABC చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ

25 Sep, 2021 04:57 IST|Sakshi

న్యూఢిల్లీ: 2021–2022 ఏడాదికిగాను ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్యులేషన్స్‌(ఏబీసీ) చైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన యునైటెడ్‌ బ్రూవరీస్‌ లిమిటెడ్‌కు చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, సేల్స్‌ ఆపరేషన్స్, బిజినెస్‌ స్ట్రాటజీ, ఇన్నోవేషన్‌ ఇలా పలు విభాగాల్లో ఆయనకు 27 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. ఏబీసీ కౌన్సిల్‌ పబ్లిషర్‌ సభ్యులైన ప్రతాప్‌ జి. పవార్‌.. ఏబీసీ డెప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అడ్వటైజర్స్‌ రిప్రజెంటేటివ్స్‌గా ఐటీసీ సంస్థ తరఫున కరుణేశ్‌ బజాజ్, టీవీఎస్‌ మోటార్‌ కంపనీ తరఫున అనిరుద్ధ హల్‌దార్, మారుతి సుజుకీ ఇండియా తరఫున శశాంక్‌ శ్రీవాస్తవ ఉన్నారు.
చదవండి: తల్లికి మధురమైన గిఫ్ట్‌ ఇచ్చిన విజయ్‌ దేవరకొండ

పబ్లిషర్స్‌ రిప్రజెంటేటివ్స్‌గా సకల్‌ పేపర్స్‌ సంస్థ తరఫున ప్రతాప్‌ పవార్, మలయాళ మనోరమ తరఫున రిషద్‌ మాథ్యూ, లోక్‌మత్‌ మీడియా తరఫున దేవేంద్ర వి. దర్దా, ది బాంబే సమాచార్‌ తరఫున హర్ముస్జీ ఎన్‌. కామా, జాగరణ్‌ ప్రకాశన్‌ తరఫున శైలేశ్‌ గుప్తా, హెచ్‌టీ మీడియా తరఫున ప్రవీణ్‌ సోమేశ్వర్, బెన్నెట్,కోల్మన్‌ అండ్‌ కో తరఫున మోహిత్‌ జైన్, ఏబీపీ తరఫున ధ్రువ ముఖర్జీ ఉన్నారు. అడ్వటైజింగ్‌ ఏజెన్సీల రిప్రజెంటేటివ్స్‌గా మ్యాడిసన్‌ కమ్యూనికేషన్స్‌ తరఫున విక్రమ్‌ సఖూజా, ఐపీజీ మీడియాబ్రాండ్స్‌ తరఫున శశిధర్‌ సిన్హా, ఆర్‌కే స్వామి బీబీడీవో తరఫున శ్రీనివాసన్‌ కె. స్వామి, డెంట్సు ఏగిస్‌ నెట్‌వర్క్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా సంస్థ తరఫున ఆశిశ్‌ భాసిన్‌ ఉన్నారు. సెక్రటరీ జనరల్‌గా హార్ముజ్‌ మాసాని కొనసాగనున్నారు.
చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన

మరిన్ని వార్తలు