మంగోలియా, జపాన్‌లలో నేటి నుంచి రాజ్‌నాథ్‌ పర్యటన

5 Sep, 2022 05:07 IST|Sakshi

న్యూఢిల్లీ: మంగోలియా, జపాన్‌లలో ఐదు రోజుల పర్యటనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం బయలుదేరి వెళ్లారు. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు దేశాలతో వ్యూహాత్మక, రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా పర్యటన సాగనుందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.

5 నుంచి 7 వరకు మంగోలియాలో ఆయన పర్యటన ఉంటుంది. భారత రక్షణ మంత్రి ఒకరు మంగోలియాలో పర్యటించడం ఇదే ప్రథమం. అనంతరం 8, 9 తేదీల్లో జపాన్‌ పర్యటన సందర్భంగా జరిగే 2+2 విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు జై శంకర్‌ కూడా పాల్గొంటారు.

మరిన్ని వార్తలు