వినాయక నిమజ్జనం సందర్భంగా సెల్ఫీ దిగే యత్నం

31 Aug, 2020 19:09 IST|Sakshi

కోల్‌కతా: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా ఓ యువకుడి సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తూ.. నదిలో కొట్టుకుపోయి మరణించాడు. ఈ ఘటన డెహ్రడూన్‌లోని సాంగ్‌ నది వద్ద జరగింది. వివరాలు.. నగరంలోని క్లెమెంట్‌ టౌన్‌లో నివాసం ఉండే శుభం ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం వినాయకుడి నిమజ్జనం సందర్భంగా సాంగ్‌ నది వద్ద సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలు జారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రాష్ట్ర విపత్తు స్పందన దళం సాయంతో రెండు గంటల అన్వేషణ తర్వాత శుభం మృతదేహాన్ని వెలికి తీశారు. 

మరిన్ని వార్తలు