రజినీ స్టైల్‌లో ట్రాఫిక్‌ క్లియర్‌.. రోడ్డుపై ఆయనుంటే సందడే వేరు.. వీడియో వైరల్‌!

16 Sep, 2022 13:56 IST|Sakshi

సోషల్‌ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు.. చూడగానే నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని వీడియోలు ఆవేదనకు గురిచేస్తాయి. కాగా, ఓ ట్రాఫిక్‌ పోలీసు వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. వాహనాలను మళ్లించే ఆయన యూనిక్‌ స్టైల్‌ చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

వివరాల ‍ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న సిటీ హార్ట్‌ ఆసుపత్రి వద్ద హోంగార్డ్‌ జోగింద్ర కుమార్‌ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు వస్తున్న వాహనాలను వినూత్న రీతిలో నియంత్రిస్తున్నాడు. నలువైపుల వస్తున్న వాహనాలను క్లియర్‌ చేయడానికి ఆయన డ్యాన్స్‌ చేస్తూ చూపించిన సైగలు హైలెట్‌ అని చెప్పవచ్చు. 

ఇలా వినూత్న రీతిలో ఆయన వాహనదారులను మళ్లించడం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. నేను అతడిని ప్రతీరోజూ చూస్తాను. ఆఫీసులకు వెళ్తున్న ఎంతో మందిని ఆయన ఉత్తేజపరుస్తాడు. ఆయనను దేవుడు చల్లాగా చూడాలంటూ కామెంట్స్‌ చేశాడు.

మరిన్ని వార్తలు