Asaduddin Owaisi: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కేసు నమోదు

9 Jun, 2022 14:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌లోని ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ ఆపరేషన్‌ విభాగం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.  అలాగే ఆలయ పూజారి యతి నర్సింగానంద్‌పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కాగా ఇప్పటికే మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మపై కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఆమెతోపాటు నవీన్‌ జిందాల్‌ జర్నలిస్ట్‌ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. మొత్తం  ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
సంబంధిత వార్త: వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్‌ శర్మ

మరిన్ని వార్తలు