ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఆఫీసులో ఐటీ సోదాలు

16 Oct, 2020 14:06 IST|Sakshi

రూ.5.5 కోట్ల నగదు, కీలక పత్రాలు స్వాధీనం

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ మనోజ్‌ కే సింగ్‌ కార్యాలయంలో గురువారం ఐటీ శాఖ సోదాలు చేసింది. ఢిల్లీ, హరియాణా, ఎన్‌సీఆర్‌లోని 38 చోట్ల తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 5.5 కోట్ల రూపాయల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మనోజ్‌ కే సింగ్‌ తన క్లయింట్ల నుంచి భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసి పన్ను ఎగ్గొడుతున్నారనే ఆరోపణలో నేపథ్యంలో ఈ దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 217 కోట్ల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించి ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ‘మనోజ్‌ కే సింగ్‌ ఒక క్లయింట్ నుంచి నగదు రూపంలో 117 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కానీ రికార్డుల్లో మాత్రం కేవలం 21 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నట్లు చూపించారు. అది కూడా చెక్ ద్వారా పొందినట్లు పేర్కొన్నారు’ అన్నారు అధికారులు. (చదవండి: విజయ్‌ని కావాలనే టార్గెట్‌ చేశారా !)

అలానే మరొక సందర్భంలో మనోజ్‌ కే సింగ్‌‌ ప్రభుత్వ రంగ సంస్థతో మధ్యవర్తిత్వం నెరిపినందుకుగ ఓ మౌలిక సదుపాయాలు, ఇంజనీరింగ్ సంస్థ నుంచి 100 కోట్ల నగదు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని ఆయన వాణిజ్య, నివాస ఆస్తులు కొనడమే కాక పాఠశాలలో నిర్వహణలో ఉన్న ట్రస్టులను స్వాధీనం చేసుకోవడంలో ఉపయోగించినట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు