‘నన్నేందుకు తీసుకెళ్లలేదు.. అబద్ధం చెప్పకండి’

27 Jan, 2021 18:55 IST|Sakshi
ఢిల్లీ వైద్యుడు డాక్టర్‌ కేకే అగర్వాల్‌

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. తొలుత వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వైద్యుడికి, అతడి భార్యకు మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వైరలవుతోంది. వివరాలు.. డాక్టర్‌ కేకే అగర్వాల్‌ ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అతడు కరోనా వ్యాక్సిన్తీసుకున్నాడు. ఆ తర్వాత భార్య అతడికి కాల్‌ చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీశాడు డాక్టర్‌. ఇక తాను వ్యాక్సిన్‌ తీసుకున్నానని భార్యకు చెప్పగా.. ఆమె తనను ఎందుకు తీసుకెళ్లలేదని డాక్టర్‌ని ప్రశ్నిస్తుంది. అందుకు అతడు ‘‘వ్యాక్సిన్‌ని పరీక్షించేందుకు గాను మేం టీకా తీసుకున్నాం. వారు నన్ను వ్యాక్సిన్‌ తీసుకోమన్నారు.. అందుకే వేసుకున్నాను’’ అని చెప్తాడు. 
(చదవండి: వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌)

కానీ అతడి భార్యకు ఈ సమాధానం నచ్చలేదు. దాంతో పదే పదే నన్ను మీతో పాటు ఎందుకు తీసుకెళ్లలేదు.. మీరు అబద్ధం చెప్తున్నారు అనడం వీడియోలో వినవచ్చు. ఇక డాక్టర్‌ నేను లైవ్‌లో ఉన్నాను అని చెప్పి కాల్‌ కట్‌ చేసే ప్రయత్నం చేస్తాడు. అందుకు ఆమె ఆగండి నేను కూడా లైవ్‌లోకి వస్తాను అని బెదిరిస్తుంది. ఇక డాక్టర్‌ కార్లో ఉండి ఈ వీడియోని తీశారు. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోని ఇప్పటికే లక్ష మందికి పైగా చూశారు. ‘‘లైవ్‌లో ఉండగా కాల్‌ లిఫ్ట్‌ చేయకండి’’.. ‘‘భార్యను వదిలి ఈ ప్రపంచంలో మనం ఏం చేయలేం’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 

మరిన్ని వార్తలు