కేవలం ఒక్క రూపాయకే ‘థాలి’..

27 Oct, 2020 19:53 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఎంతోమంది జీవనోపాధి పొగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఎందరో ఉద్యోగం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చేతిలో పని లేకపోవడంతో చాలా మందికి కడుపు నిండా తిండి దొరకడం కూడా గగనంగా మారింది. మన దగ్గర రోజు పని దొరికితేనే.. నాలుగు వేళ్లు నోటిలోకి వెళ్లే జనాభా ఎక్కువ. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం 2020 చివరి నాటికి అదనంగా 130 మిలియన్ల మంది ప్రజలు ఆహార అభద్రతను ఎదుర్కోగలరని అంచాన వేసింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ ఫుడ్‌ స్టాల్‌ కేవలం ఒక్క రూపాయకే పూర్తి థాలిని అందించి.. ఎందరికో ఆకలి తీర్చుతుంది. (చదవండి: కొంచెం.. జోష్‌ తగ్గింది)

వివరాలు.. ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలోని శివ మందిరం సమీపంలో శ్యామ్‌ రసోయి అనే ఫుడ్‌ స్టాల్‌ ఉంది. కరోనా నేపథ్యంలో ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారికి సేవ చేయడం కోసం శ్యామ్‌ రసోయి యాజమాన్యం కేవలం ఒక్క రూపాయికే పూర్తి థాలిని అందిస్తుంది. రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా షాప్‌ యజమాని గోయల్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి రోజు రెండు వేల మందికి ఆహారం అందిస్తున్నాం. దుకాణం దగ్గరికి వచ్చే వారు ఓ 1000 మంది ఉంటే.. మరో వెయ్యి మందికి ఇ-రిక్షాలలో వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నాం’ అని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు