పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌

26 Jun, 2021 10:09 IST|Sakshi

తప్పిన ముప్పు.. రత్నగిరిలో ఘటన 

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో హజరత్‌ నిజాముద్దిన్‌ – మడ్‌గావ్‌ రాజధాని సూపర్‌ ఫాస్ట్‌ స్పేషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌ పట్టాలు తప్పింది. కోంకణ్‌ రైల్వేమార్గంపై ఉక్షీ – భోకేల మధ్య ఉన్న కురబుడే టన్నెల్‌ మధ్యలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కోంకణ్‌ రైల్వే పీఆర్‌వో సచిన్‌ దేశాయి అందించిన వివరాల మేరకు.. కరబుడే టన్నెల్‌లో శనివారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఊహించని విధంగా రైలు ఇంజిన్‌ చక్రం టన్నెల్‌ మధ్యలో నుంచి వెళ్లే సమయంలో పట్టాలు తప్పింది. చీకటి గుహలో ఉన్నామని తెలుసుకున్న ప్రయాణికులు అరుపులు కేకలు పెట్టారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అనంతరం యుద్ద ప్రతిపాదికపై పనులు చేపట్టిన రైల్వే సిబ్బంది రైల్వే మార్గాన్ని పునరుద్దరించారు. అయితే సుమారు 7 గంటలపాటు ఈ కోంకణ్‌ మార్గంపై రైళ్ల రాకపోకలు స్థంబించిపోయాయి.

చదవండి: ‘పిల్లలకు కోవిడ్‌ టీకా’పై మరింత డేటా రావాల్సి ఉంది

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు