ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రూ.2 వేల జరిమానా రూ.500కు తగ్గింపు

26 Feb, 2022 20:10 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోర్‌ వీలర్‌ వాహనాల్లో కలిసి ప్రయాణించేవారు మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఫిబ్రవరి 28(సోమవారం) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఫోర్‌ వీలర్‌ వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు మాస్క్‌ తప్పనిసరి ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం నిబంధలను విధించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగితే విధించే రూ.2 వేల జరిమానాను రూ.500 తగ్గిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇటీవల ఫోర్‌ వీలర్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మాస్క్‌ ధరించాలన్న నిబంధనను ఢిల్లీ ప్రభుత్వం తొలగించింది. కారులో ఒక్కరు ప్రయాణిస్తున్నప్పుడు కూడా తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుపై ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు