మనీశ్‌ సిసోడియాపై సీబీఐ దాడుల ఎఫెక్ట్‌?.. భారీగా ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్‌

20 Aug, 2022 08:41 IST|Sakshi

ఢిల్లీ: ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఇతరులపై సీబీఐ దాడుల నేపథ్యంలో.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీకి సంబంధించిన ఆరోపణలపై.. ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంపై శుక్రవారం సాయంత్రం దాడులు నిర్వహించింది. సిసోడియాతో పాటు మాజీ ఎక్సైజ్‌ కమిషనర్‌ అరవ గోపీకృష్ణతో పాటు పలువురు అధికారులు, వ్యాపారవేత్తలు, మద్యం వ్యాపారులు తదితరుల నివాసాల్లో.. మొత్తం దేశవ్యాప్తంగా 31 చోట్ల సోదాలు చేసింది.

సుమారు 14 గంటల తనిఖీల తర్వాత మనీశ్‌ సిసోడియా ఫోన్‌, కంప్యూటర్‌లను సీబీఐ సీజ్‌ చేసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జంకే ప్రసక్తే లేదని, ఉచిత విద్య-ఆరోగ్యం అందించి తీరతామంటూ ప్రకటన చేశారు. మరోవైపు ఆప్‌ జాతీయ కన్వీనర్‌.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా ఇది బీజేపీ ప్రతీకార రాజకీయమంటూ మండిపడ్డారు. దర్యాప్తు ఏజెన్సీలతో ప్రతీకార దాడులకు పాల్పడుతోందంటూ విమర్శించారు.  క్లిక్‌: సిసోడియాపై దాడులు, కేసు ఏంటంటే..

ఇదిలా ఉంటే.. ఒకవైపు సీబీఐ తనిఖీలు కొనసాగుతున్న వేళ మరోవైపు ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీగా ఐఏఎస్‌లను బదలీలు చేశారు. బదిలీ అయిన వాళ్లలో ఆరోగ్య-కుటుంబ సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి ఉదిత్‌ ప్రకాశ్‌ రాయ్‌ సైతం ఉండడం గమనార్హం. ఆయన్ని పరిపాలన సంస్కరణల విభాగానికి బదిలీ చేసింది ఢిల్లీ సర్కార్‌.

అరుణాచల్‌ ప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఉదిత్‌ ప్రకాశ్‌రాయ్‌పై ఈ మధ్యే ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు. రెండు అవినీతి కేసులతో పాటు ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ నుంచి రూ. 50 లక్షల లంచం తీసుకున్నాడని, వెంటనే తప్పించాలని కేంద్ర హోంమంత్రిత్వ వ్యవహారాల శాఖకు ఎల్జీ సిఫార్సు చేశారు.

వీళ్లతో పాటు మనీశ్‌ సిసోడియాకు దగ్గరగా ఉండే.. విజేంద్ర సింగ్‌ రావత్‌, జితేంద్ర నారాయిన్‌, వివేక్‌ పాండేలు, శుభిర్‌ సింగ్‌, గరిమా గుప్తా సైతం ట్రాన్స్‌ఫర్డ్‌ లిస్ట్‌లో ఉండడం గమనార్హం. మొత్తం పన్నెండు మందిని ఆఘమేఘాల మీద ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు ఎల్జీ వినయ్‌ కుమార్‌.

ఇదీ చదవండి: బీజేపీ ఆరోపణలపై న్యూయార్క్‌ టైమ్స్‌ రియాక్షన్‌

మరిన్ని వార్తలు