సర్‌ కాదు.. అందులో నుంచి బయటకు రండి!

18 Feb, 2022 21:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో మహిళా న్యాయమూర్తి, న్యాయవాది మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టులో ఓ కేసుకు సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మహిళా న్యాయమూర్తి రేఖాపల్లిని ఉద్దేశిస్తూ ఓ అడ్వకేట్‌.. ‘సర్‌’ అని సంబోధించాడు.

దీంతో వెంటనే స్పందించిన న్యాయమూర్తి రేఖాపల్లి.. తాను ‘సర్‌’ కాదని, ఆ భావన నుంచి బయటకు రావాలని చాకచక్యంగా సమాధానం ఇచ్చారు.

జడ్జి మాటలకు స్పందించిన సదరు అడ్వొకేట్‌.. క్షమాపణ కోరుతూనే ఆ స్థానంలో ఎక్కువగా మగవారే కూర్చుంటారు కదా. ఆ ఉద్దేశంతోనే ఏమరపాటుతో అలా అనేశానని వివరణ ఇచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు