ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల కలకలం

26 May, 2021 14:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేకమంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మహమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే చాలామంది కరోనా నుంచి కోలుకున్న తర్వాతే బ్లాక్ ఫంగస్ బారిన పడడానికి కారణం స్టెరాయిడ్ల వినియోగం, ఇతర అనారోగ్య సమస్యలని నిపుణులు చెబుతున్నారు. 

కాగా ప్రస్తుతం ఢిల్లీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. మే 23న 200లకు పైగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మే 24, 25న 100 కంటే తక్కువ కేసులు నమోదవగా..తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన వారి సంఖ్య  600కు చేరినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక అంటువ్యాధుల నివారణ చట్టం ప్రకారం సుమారు 10 రాష్ట్రాలు బ్లాక్‌ఫంగస్‌ను(మ్యూకోమైకోసిస్‌)ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించాయి. ప్రస్తుతానికి బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం యాంఫోటెరిసిన్-బి అనే యాంటీ ఫంగల్‌ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు.


(చదవండి: సెకండ్‌ వేవ్‌: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు)

(చదవండి: ‘మితిమీరిన స్టెరాయిడ్స్ వాడకమే బ్లాక్ ఫంగస్‌కు కారణం’)

మరిన్ని వార్తలు