వైఎస్సార్‌సీపీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌ కొట్టివేత

4 Jun, 2021 11:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.  ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా వైఎస్సార్‌ అన్న పదం తమకే చెందుతుందని అన్న వైఎస్సార్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. వైఎస్సార్‌సీపీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ఈ క్రమంలో శుక్రవారం ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని పేర్కొంటూ అన్న వైఎస్సార్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అన్నవైఎస్సార్‌ పిటిషన్‌కు ఎలాంటి మెరిట్‌ లేదన్న న్యాయస్థానం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

చదవండి: సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్‌-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు